విద్యార్థునులపై తేనేటీగల దాడి- 30 మంది అస్వస్థత

Dec 1,2023 08:49 #Bee attack, #kadiri

ప్రజాశక్తి – కదిరి టౌన్‌: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థునులపై తేనేటీగలు దాడి చేశాయి. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థునుల సమాచారం మేరకు.. మధ్యాహ్న భోజనం సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులతో పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయులు పరిశుభ్రత పనులు చేయించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వారిని తేనెటీగలు చుట్టుముట్టాయి. తేనేటీగలు కుట్టడంతో 30 విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వారిని హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. పాఠశాలలో సిబ్బంది ఉన్నప్పటికీ విద్యార్థినుల చేత పనులు ఎందుకు చేయిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. తాము విద్యార్థినుల చేత ఎలాంటి పనులు చేయించలేదని, విద్యార్థినులు అస్వస్థతకు గురైన సమయంలో అక్కడ ఎలాంటి తేనేటీగలు లేవని పాఠశాల హెచ్‌ఎం పేర్కొన్నారు.

➡️