ప్రజాశక్తి శ్రీకాకుళం ప్రతినిధి భీమారావుకు పితృ వియోగం

Dec 18,2023 10:03 #passed away, #prajasakti
bhimarao father passed away

నేడు శ్రీకాకుళంలో అంత్యక్రియలు
ప్రజాశక్తి-విశాఖపట్నం :’ప్రజాశక్తి’ శ్రీకాకుళం స్టాఫ్‌ రిపోర్టర్‌ టి.భీమారావు తండ్రి తోట లక్ష్మణరావు (82) ఆదివారం విశాఖ కెజిహెచ్‌లో మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం ఆయనను అనారోగ్యం కారణంగా శ్రీకాకుళం నుంచి కెజిహెచ్‌కు తీసుకొచ్చారు. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందారు. వారికి నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో భీమారావు 3వ కుమారుడు. లక్ష్మణరావు భౌతికకాయాన్ని శ్రీకాకుళంలోని వారి గృహానికి తరలించారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లక్ష్మణరావు మృతికి ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లక్ష్మణరావు మృతికి సంతాపం తెలిసిన వారిలో ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్‌ మేనేజర్‌ పి.కామినాయుడు, విశాఖ ఎడిషన్‌ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు ఉన్నారు.

➡️