బోసిపోయిన భాగ్యనగరం

May 12,2024 22:22 #Bhagyanagara, #nirmanushyam

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ఓట్ల పండుగతో భాగ్యనగరం హైదరాబాద్‌ బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, కోఠి, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తగ్గాయి. రాత్రి పగలూ తేడా లేకుండా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే నగర రహదారులు ప్రస్తుతం.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆదివారం కూడా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లల్లో రద్దీ కొనసాగింది. తెలంగాణలో లోక్‌సభ, ఎపిలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది.

➡️