AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో
రాష్ట్ర 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈ నెల 21న ఉదయం 9 గంటల 46 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నరు ఈ నెల 19న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు శాసన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం స్పీకరు ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత గవర్నరు ప్రసంగం, ధన్యవాద తీర్మానాలు ఉండనున్నాయి.

ప్రొటెం స్పీకరుగా బుచ్చయ్య చౌదరి ప్రమాణం
శాసనసభలో సీనియర్‌ శాసనసభ్యులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రభుత్వం ప్రొటెం స్పీకరుగా నియమించింది. ఈ నెల 21 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రొటెం స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం నూతన స్పీకరు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపా టి రవి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఎంఎస్‌ రాజు, సుంకర విజరుకుమార్‌, విజయలక్ష్మి పాల్గొన్నారు.

➡️