మంత్రి సుభాష్‌ దూకుడు.. ఏరియా ఆసుపత్రి అకస్మిక తనిఖీ

  • బయట టెస్టులు, అధిక రేట్లు మందులపై ఆగ్రహం

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌ నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తూ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. బ్లడ్‌ టెస్ట్‌లకు, ఎక్స్రే, స్కానింగ్‌లకు అన్ని పరికరాలు ఉన్నా సరే పేషెంట్లను బయటకు ఎందుకు పంపుతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ ప్రవీణ్‌ వీటిపై నిలదీశారు. ఆసుపత్రి ఆవరణలో గల జనరిక్‌ మెడికల్‌ షాపులో మెడిసిన్‌ అత్యధిక రేట్లకు అమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఓపి విభాగం, ఎక్స్రే రే గది, కంప్యూటర్‌ విభాగం, మందులు , ఆసుపత్రి అభివృద్ధి పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️