చలో మాచర్లకు టిడిపి పిలుపు.. పోలీసుల అలెర్ట్‌

May 23,2024 10:37 #gunter, #macharla, #TDP
  • టిడిపి ముఖ్య నాయకులు గృహనిర్భందం
  • జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని హెచ్చరిక

ప్రజాశక్తి-గుంటూరు :  పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మాచర్లకు వెళ్లకుండా గొల్లపూడిలో దేవినేని ఉమాను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలోని సమస్యత్మక పట్టణాల్లో పదిరోజులుగా షాపులు మూసివేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికీ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరుగుతూనే ఉన్నా సంగతి తెలిసిందే.

➡️