విశాఖలో రూ.కోటిన్నర నగదు పట్టివేత

May 12,2024 22:16 #money sized, #visakhapatnam

ప్రజాశక్తి-విశాఖపట్నం:సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్‌కే బీచ్‌కు సమీపంలోగల పాండురంగాపురంలో రూ.కోటిన్నర నగదును జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. కొందరు వ్యక్తులు నగదును కారులో తరలిస్తున్నట్లు సి విజిల్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. బీచ్‌ రోడ్డులో తనిఖీలు చేపట్టగా కారులో నగదును విడిచిపెట్టి నిందితులు పరారయ్యారు. ఆ మొత్తాన్ని సీజ్‌ చేసిన అధికారులు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

➡️