గచ్చిబౌలిలో రూ.5కోట్ల నగదు పట్టివేత

Nov 23,2023 15:09 #money, #seized

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటానికల్‌ పార్కు నుంచి చిరాక్‌ పబ్లిక్‌ స్కూల్‌ వైపు వెళ్తున్న కారును తనికీ చేసిన పోలీసులు రూ.5 కోట్లు పట్టుకున్నారు. ఈ నగదు ఓ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా గుర్తించారు. పట్టుబడిన నగదును ఐటీశాఖకు అప్పగించారు.

➡️