చంద్రబాబుకు ఇసుక కేసులోనూ ఊరట

Nov 25,2023 09:57 #Case, #Nara Chandrababu, #relief, #sand

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఉచిత ఇసుక విధానం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో శుక్రవారం తాత్కాలిక ఊరట లభించింది. ఆ కేసుల్లో తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సిఐడి వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 29కు వాయిదా వేసింది. అదేవిధంగా ఉచిత ఇసుక విధానం కేసులో సిఐడి కౌంటర్‌ వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 30కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

➡️