తిరుమలలో మళ్లీ చిరుత సంచారం

Dec 30,2023 09:36 #again, #Cheetah, #Tirumala walkway

తిరుపతి : తిరుమలలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారం ట్రాప్‌ కెమెరాల్లో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబరు 13, 29 రోజుల్లో ట్రాప్‌ కెమెరాకు చిరుత, ఎలుగుబంటి కదలికలు చిక్కినట్లు టిటిడి వెల్లడించింది. ఈ నేపథ్యంలో తిరుమల నడకమార్గంలో వచ్చే భక్తులకు టిటిడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలని సూచించారు.

➡️