తూర్పు నౌకాదళ కమాండ్‌ను సందర్శించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్  

Dec 30,2023 10:20 #Defense Ministry, #Visakha
chief of defence

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రెండు రోజుల పర్యటన నిమిత్తం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం ఉదయం తూర్పు నౌకాదళ కమాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ డేగాలో తూర్పు నావికా దళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వైస్ అడ్మ్ రాజేష్ పెంధార్కర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కు తూర్పు నౌకాదళ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, బాధ్యతలపై సమగ్రమైన బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అనంతరం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో రాజేష్ పెంధార్కర్, జనరల్ అనిల్ చౌహాన్ లు సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం జనరల్ అనిల్ చౌహాన్ తూర్పు నౌకాదళ కమాండ్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన వివిధ నౌకాదళ కార్యాచరణ, సౌకర్యాలు, రాబోయే ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుందని, ఇది త్రి-సేవల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తుందని తుర్పునావికా దళ అధికారులు తెలిపారు.

➡️