ఐటిడిఎ ముట్టడిని విజయవంతం చేయాలి 

Feb 17,2024 08:34 #CITU, #Health workers, #Protest
citu calls protest at itda

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ

కొనసాగిన సిహెచ్‌డబ్ల్యు రిలే దీక్షలు

ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు (సిహెచ్‌డబ్ల్యు) చేపట్టిన సామూహిక రిలే దీక్షలు శుక్రవారమూ కొనసాగాయి. పార్వతీపురం ఐటిడిఎ ఎదుట చేపట్టిన దీక్షలనుద్దేశించి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. సిహెచ్‌డబ్ల్యులను ఆశాలుగా గుర్తించాలని, రూ.10 వేలు చెల్లించి యూనిఫార, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న తలపెట్టిన ఐటిడిఎ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సీతంపేటలో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఎ ఎదుట కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు చేపట్టిన దీక్షలను శుక్రవారంతో ముగిశాయి. దీక్షలను సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు చిన్నయ్యపడాల్‌ విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజులుగా దీక్షలు చేస్తున్నా ఐటిడిఎ, వైద్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వెంటనే సిహెచ్‌డబ్ల్యుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️