‘పర్సా’కు సిఐటియు నివాళి

May 22,2024 22:11 #'Parsa', #CITU's, #tribute

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు పర్సా సత్యనారాయణ వర్థంతి కార్యక్రమం సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నర్సింగరావు కలిసి పర్సా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ వి ఉమామహేశ్వరరావు, కె ఉమామహేశ్వరరావు, కె ధనలక్ష్మి, కెఆర్‌కె మూర్తి, వివిఎల్‌ నర్సింహులు, కెఎస్‌ కోటేశ్వరరావు, ఎం సత్యప్రసాద్‌, ఎం శివ తదితరులు పాల్గొన్నారు.

➡️