ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్‌ గాలికొదిలేశారు : అచ్చెన్నాయుడు

Dec 9,2023 15:18 #achennaidu, #press meet

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్‌ గాలికొదిలేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ రెడ్డి అసమర్థ పాలనతో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వఅథాగా పోతోందని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు రాకుండా తమపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు. టీఎంసీ.. క్యూసెక్కు.. ఈ రెండింటికీ తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల దగ్గర ఆందోళనలు చేపడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

➡️