శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం.. పలువురు మంత్రులకు పిలుపు

Jan 9,2024 15:30 #ap cm jagan, #Calls ministers

అమరావతి: శింగనమల ఎమ్మెల్యే జన్నలగడ్డ పద్మావతిపై వైసిపి అధినేత, సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన నేపథ్యంలో ఆయన వివరణ కోరారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లి రావాలని సీఎంవో అధికారులు సూచించారు. దీంతో ఆమె అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకఅష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కలవనున్నారు.మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. సాయంత్రంలోగా వారు సీఎంను కలవనున్నారు. తమ సీట్ల విషయంపై జగన్‌తో చర్చించనున్నారు.

➡️