కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి అన్యాయం : సిపిఐ రామకృష్ణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర మంత్రి పదవుల విషయంలో, శాఖల కేటాయింపు అంశంలో రాష్ట్రానికి మరోమారు అన్యాయం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ఎపికి మరోమారు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రం నుంచి ఒక పూర్తిస్థాయి మంత్రినే మంత్రివర్గంలోకి తీసుకుందని, అది కూడా రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని పౌర విమానయానశాఖను కేటాయించిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉన్న శాఖలను కేటాయించకపోవటం విచారకరమన్నారు. జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో అసలు చోటే కల్పించలేదన్నారు. ఇద్దరికి సహాయ మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ వారికి స్వతంత్ర హోదా లేదన్నారు.

➡️