తీవ్రంగా ఖండిస్తున్నాం : కానిస్టేబుల్‌ గణేశ్‌ హత్యపై సిపిఎం

Feb 7,2024 10:36 #AP police, #CPM AP, #Murder, #smugglers
cpm state committee on constable murder

ప్రజాశక్తి-విజయవాడ : అన్నమయ్య జిల్లా కంభంవారి పల్లె మండలం ఎంవీపల్లి గ్రామం వద్ద ఎర్ర చందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేశ్‌ను కారుతో ఢీకొట్టి చంపడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తునట్లు సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి పేర్కొంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్లు గత కొంతకాలంగా పేట్రేగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం గర్హనీయమని పేర్కొంది. కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటి కోరింది.

➡️