సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌కు సిపిఎం మద్దతు

Apr 24,2024 23:21 #cpm, #prakatana

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్నట్లు సిపిఎం పార్టీ ప్రకటించింది. గత పదేళ్లుగా దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతూ నిరంకుశంగా పాలిస్తున్న బిజెపిని ఓడించాలని సికింద్రాబాద్‌ ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్‌ గెలుపు కోసం సిపిఎం కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలని సిపిఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ కమిటి కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

➡️