కిశోర్‌ చంద్రదేవ్‌ను కలిసిన సిపిఎం బృందం

ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ను కురుపాంలోని ఆయన నివాసరలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులకు మద్దతు ప్రకటించినందుకు దుశ్శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కిశోర్‌ చంద్రదేవ్‌… కౌంటింగ్‌ రోజు ఏజెంట్లు నిర్వహించాల్సిన బాధ్యతలు, విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. అనంతరం ఇరువురూ దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నారు. కిశోర్‌ చంద్రదేవ్‌ను కలిసిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కె.సుబ్బరావమ్మ, అరకు పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, కురుపాం నియోజకవర్గ సిసిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ ఉన్నారు.

➡️