కందిపంటలో గంజాయి సాగు

Mar 20,2024 21:56 #ganjay, #ongle district, #police arest

– 282 మొక్కలు స్వాధీనం, నిందితుడు అరెస్టు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా), మైదుకూరు :కంది పంటలో గంజాయి మొక్కలు సాగు చేసిన నిందితుడిని ఎస్‌ఇబి అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఇబి అధికారుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గంగుపల్లి గ్రామానికి చెందిన కేశనపల్లి బ్రహ్మయ్య తన ఐదెకరాల పొలంలో కంది పంట సాగు చేశారు. అప్పుల బారి నుంచి బయటపడేందుకు గంజాయి విత్తనాలు కొనుగోలు చేసి వాటిని కంది పంటలో వేశారు. మొత్తం 282 గంజాయి మొక్కలు సాగు చేశారు. ఎస్‌ఇబి అధికారులకు అందిన సమాచారం మేరకు బ్రహ్మయ్య కంది పంటను బుధవారం వారు పరిశీలించారు. గంజాయి మొక్కలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. రెండు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు గంజాయి మొక్కలు పెరిగాయని, వీటి విలువ రూ. మూడు లక్షల వరకు ఉంటుందని ఎస్‌ఇబి సిఐ నాగేశ్వరరావు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో 12 కేజీల గంజాయి స్వాధీనంవైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు పట్టణంలోని వీణ విజయరామరాజు కాలనీలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. గంజాయి రవాణా చేస్తున్న మైదుకూరు మండలం గొల్లపల్లెకు చెందిన మదెం సుస్మంత్‌ కుమార్‌, చెన్నూరు లక్ష్మీనగర్‌కు చెందిన గంధం సుబ్బరాయుడు, ప్రొద్దుటూరు శ్రీనివాస్‌ నగర్‌కు చెందిన మేకల సునీల్‌, మైదుకూరు వీణ విజయరామరాజు కాలనీకి చెందిన సాంబరావు వెంకటయ్యను అరెస్టు చేశారు. వారి నుంచి 12.100 కేజీల గంజాయితో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డిఎస్‌పి వెంకటేశుతెలిపారు.

 

➡️