ఉపాధి హామీ కూలి మృతి

ప్రజాశక్తి – ఆమదాలవలస : మండలంలోని కొర్లకోట గ్రామానికి చెందిన గురుగుబెల్లి రాజులమ్మ (62) ఉపాధి హామీ కూలి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న సత్తి బంధ చెరువులో ఈనెల 2వ తేదీ మంగళవారం నుండి పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:30 గంటలకు పనులు ప్రారంభం కాగా రాజులమ్మ మట్టి తట్టెను తీసుకు వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది గమనించిన తోటి ఉపాధి హామీ కూలీలు వెంటనే రాజులమ్మను పైకి లేపే ప్రయత్నం చేయగా ఆమె స్పందించకపోవడంతో మృతి చెందినట్లు గుర్తించారు. రాజులమ్మకు ఒక కుమారుడు కుమార్తె. వారిరువురికి వివాహాలు జరిగాయి. రాజులమ్మ మృతితో  గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

➡️