సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Apr 9,2024 12:30 #road accident, #suryapeta

హైదరాబాద్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మఅతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మోక్షిత్‌(7) మంగళవారం ఉదయయం మఅతి చెందాడు. కాగా, ఆగి ఉన్న లారీని ఆటో ఢకొీట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు ఈ ఆటోను డీకొంది.
ఈ సంఘటనలో నలుగురు మఅతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించగా మంగళవారం మోక్షిత్‌ మృతి చెందాడు. మృతులు జిల్లాలోని అర్వపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించడంతో తల్లిదండ్రుల రోదనల మిన్నంటాయి.

➡️