Delhi liquor case: కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌

Mar 26,2024 13:14 #Delhi liquor case, #Jail, #mlc kavita

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ కేసులో కవితకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ మేరకు కవితను తీహార్‌ జైలుకు తరలించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఏప్రిల్‌ 9వ వరకు కవిత తీహార్‌ జైలులో ఉండనున్నారు. జ్యుడిషియల్‌ రిమాండ్‌ నేపథ్యంలో జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ చేపడతామని రౌస్‌ ఎవెన్యూ న్యాయస్థానం స్పష్టం చేసింది.

➡️