సిఎం సభాప్రాంగణంను పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి

సిఎం సభాప్రాంగణంను పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి

ప్రజాశక్తి-తడ : ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి 21వ తేదీన తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సభాప్రాంగణంను పరిశీలన కోసం మాంబట్టులోని ఎపిఐఐసి అపాచి, టాటా స్టీల్ రోడ్ మార్గం ప్రక్కన ఉన్న ఖాళీ స్థలాలను ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలిస్తు ముందస్తు ఏర్పాట్లను  పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి, జేసీ బాలాజీ, ఎమ్మెల్యే కిలివేటి.సంజీవయ్య, తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురమల్లి రాంకుమార్ రెడ్డి, ఎన్డీసీ సిబి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సత్యవేడు ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.

➡️