మున్సిపల్‌ చైర్మన్‌ అవిశ్వాస తీర్మానంలో అపశృతి

నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌ జయబాబుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంబురాల్లో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్‌ కార్యాలయంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్‌ పార్టీ నెగ్గింది.ఈ సందర్భంగా.. పటాకులు కాలుస్తుండగా పట్టణానికి చెందిన రవి అనే యువకుడి చేతిలో బాంబులు ఉన్నాయి. అదే సమయంలో ఎదురుగా మరో వ్యక్తి బాంబులు కాలుస్తుండగా, ఆ నిప్పురవ్వలు రవి చేతిలో ఉన్న బాంబులకు తగలడంతో చేతిలో ఉన్న బాంబు పేలి చేతి వేళ్లన్నీ నుజ్జు నుజ్జు అయిపోయాయి. వెంటనే ఆ యువకుడిని బైక్‌ పై హాస్పిటల్‌కి తరలించారు.

➡️