ప్రజాసంఘాల నాయకులపై కేసు కొట్టివేత

ప్రజాశక్తి – విజయవాడ : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 2015లో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసిన నేతలపై పెట్టిన కేసును కోర్టు శుక్రవారం కొట్టివేసింది. అప్పటి టిడిపి ప్రభుత్వం అంగన్‌వాడీలతోపాటు వారికి మద్దతు తెలిపిన ప్రజాసంఘాల నాయకులపై అక్రమంగా కేసులు పెట్టింది. దీనికి సంబంధించి 680/16 కేసులోని సాక్షులను విచారించిన విజయవాడ 3వ అదనపు ఎంఎం కోర్టు న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో సిఐటియు, కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం తదితర ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రజా సంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం పెట్టిన అనేక అక్రమ కేసులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధాన్నిఆపాలని కోరారు.

➡️