ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూరి విరాళం

Feb 4,2024 09:36 #Donation, #PNM
donation to PNM

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ గుంటూరు బాపనయ్యనగర్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ప్రజా రచయిత, ప్రజానాట్యమండలి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బి.చైతన్య ప్రసాద్ యాభై వేల రూపాయల విరాళం అందించారు. శనివారం విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతున్న ప్రజా రచయితల రాష్ట్ర వర్కుషాపులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ విరాళాన్ని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, అధ్యక్షులు పి.మంగరాజు, ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డిలకు అందించారు. ప్రజా కళారూపాల సృష్టికి ప్రజానాట్యమండలి కార్యాలయం కేంద్రంగా ఉపయోగపడాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో నిర్మితమవుతున్న రాష్ట్ర కార్యాలయం కోసం విరాళాన్ని అందించిన చైతన్య ప్రసాద్ కి పలువురు సాహితీ, సాంస్కృతిక కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, ప్రజానాట్యమండలి ఉమ్మడి రాష్ట్ర నాయకులు కె.దేవేంద్ర,రాష్ట్ర నాయకులు ఐ.వి, సుభాషిణి, పెద్దిరాజు, కవి తదితరులు పాల్గొన్నారు.

➡️