జగన్ కోసం సిద్ధంః పేరుతో ఇంటింటికీ మేనిఫెస్టో

May 2,2024 15:09 #SAJJALA
  • 12 మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశాం : సజ్జల
    ప్రజాశక్తి-అమరావతి
    ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్‌ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్‌ జగన్‌ పార్టీ క్యాడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని తరగతుల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసిసి ప్రభుత్వ పాలన ఈ ఐదేళ్లకాలంలో సాగిందన్నారు. రాబోయేకాలంలో తిరిగి ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం ద్వారా సమర్ధవంతమైన, దీనికంటే మరింత మెరుగైన పరిపాలన అందిస్తామన్నారు. సిఎం వైస్‌ జగన్‌ ఆవిష్కరించిన వైసిపి మేనిఫెస్టోలో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామనేది సవవిరంగా తెలియజేశామన్నారు. వైసిపి మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా ఃఃజగన్‌ కోసం సిద్ధంఃః కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తాజాగా పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్‌ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను వైయస్‌ఆర్‌సీపీ స్టార్‌ క్యాంపెయినర్లతో కలిసి నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో పాల్గనున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా.. ఇప్పటికే 2019 మేనిఫెస్టోలోని వాగ్దానాలను 99 శాతం నెరవేర్చి ప్రజల్లో స్థిరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి సీఎం జగన్‌ అని చెప్పారు. గురువారం నుంచి చేపట్టబోయే ఃఃజగన్‌ కోసం సిద్ధంఃః కార్యక్రమం ద్వారా స్టార్‌ క్యాంపెయినర్లు, పార్టీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించనున్నారని వెల్లడించారు. ఏపీలో గత ఐదేళ్లలో 87 శాతం పేదలకు పథకాలు అందాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2019-24 మధ్య అమలు చేసిన సంక్షేమం.. ఈ దఫా అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని సీఎం జగన్‌ చెప్పారో వాటిని వివరిస్తారు. గురువారం నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యిందన్నారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతుందనేది తెలియజేసేందుకు క్యాలెండర్‌ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ అందిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం వివరాలు ఆ క్యాలెండర్‌లో పేర్కొన్నామన్నారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోను పక్కన పడేసే విధంగా కాకుండా.. ఒక ప్రామాణికంతో రికార్డెడ్‌గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున 12 మంది స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేశామన్నారు. వివిధ సామాజిక వర్గాల నుంచి వీళ్లను ఎంపిక చేసి ఈసీకి అందజేశామని సజ్జల తెలిపారు. ఇతర పార్టీలకు ఉన్నట్లు వైయస్‌ఆర్సీపీకి సీని హిరోలు స్టార్‌ క్యాంపెయినర్లుగా లేరని, పేదలే వైసీపీ స్టార్‌ క్యాంపెయినర్లని, వివిధ పేద వర్గాలనుంచి 12 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ 12 మంది పేర్లు ఈసీకు కూడా సమర్పించినట్లు వెల్లడించారు.
➡️