మెగా డీఎస్సీ ఎప్పుడు..? : డివైఎఫ్ఐ 36గంటల దీక్ష

dyfi protest for mega DSC iv

ప్రజాశక్తి-విజయవాడ : మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోనీ ధర్నా చౌక్ దగ్గర 36గంటల దీక్షను చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ ఐవి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గడిచిన నాలుగు సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్‌ అయిన వదిలేవారని అన్నారు. ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా డిఎస్‌సి నిర్వహిస్తామని పాదయాత్ర సమయంలో వై.ఎస్‌. జగన్‌ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఒక్క డిఎస్‌సి కూడా వదలలేదని విమర్శించారు. బొత్స సత్య నారాయణ సంక్రాంతి తర్వాత డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారని,  ఇప్పటికీ విడుదల చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వాలని, లేకుంటే రాబోవు రోజులలో ప్రభుత్వానికి నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

➡️