పోలింగ్‌ సమయాల్లో మార్పులు చేయాలి: మాజీ ఎంపీ కనకమేడల

May 2,2024 16:16 #letter, #tdp ex mp

అమరావతి: ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అత్యధిక ఉష్ణోగ్రతలతో కొన్ని రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అసలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలంటనే ప్రజలు హతలెత్తిపోతున్నారు.
ఈ మేరకు ఎన్నికల సంఘానికి టీడీపీ రాజ్యసభ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ లేఖ రాశారు. ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఈ అంశాన్ని దఅష్టిలో పెట్టుకొని ఓటింగ్‌ సమయాన్ని పెంచాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్‌ సమయాన్ని మరో గంటల పెంచాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఇప్పటికే తెలంగాణలో ఓటింగ్‌ సమయాన్ని పెంచారని, అదే తరహాలో ఏపీలో కూడా సమయం పెంచాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ఓటింగ్‌ శాతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఓటింగ్‌ సమయాన్ని పెంచాల్సిందిగా తన లేఖలో కనకమేడల కోరారు.

➡️