గురుకుల విద్యా సంస్థల ప్రవేశాల దరఖాస్తుకు గడువు పొడిగింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గురుకుల విద్యా సంస్థల ప్రవేశాల దరఖాస్తును ఎపి గురుకుల విద్యాలయాల సంస్థ పొడిగించింది. మార్చి 31తో ముగిసిన తేదీని ఈ నెల 5 వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆర్‌ నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు aprs.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 5లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి 5, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలు, మొదటి సంవత్సరం ఇంటర్‌, డిగ్రీలో ప్రవేశాల కోసం ఎపిఆర్‌ఎస్‌ సిఎటి-2024, ఎపిఆర్‌జెసిఅండ్‌డిసి సెట్‌-2024లను గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తుంది.

➡️