ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం..

Doubts-on-Chandrababu%27s-medical-report-Sajjala

ప్రజాశక్తి-అమరావతి : ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారంటూ టిడిపి నేతలపై వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లు వచ్చినప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌ అని ప్రశంసలు కురిపించారు.. గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నామని.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు.

➡️