రాష్ట్రపతి ముర్ము కు ఘనంగా వీడ్కోలు

Dec 23,2023 15:45 #droupathi murmu, #farewell

హైదరాబాద్‌ : శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీకి పయనమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిలు ఘనంగా వీడ్కోలు పలికారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి హకీంపేటకు చేరుకున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్న రాష్ట్రపతి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా, సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పోట్రు లు రాష్ట్రపతికి శాలువా అందజేసి బై.. బై మేడం.. అంటూ వీడ్కోలు పలికారు.

➡️