మెట్రో రైల్‌ డిపోలో అగ్నిప్రమాదం

Apr 2,2024 13:10 #fire acident, #hydrabad

హైదరాబాద్‌ : మియాపూర్‌ లోని మెట్రో రైల్‌ డిపోలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డిపోలోని చెత్త డంపింగ్‌ ఏరియాలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో రైల్‌ సిబ్బంది.. పైర్‌ డిపార్ట్‌ మెంట్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలను తెలియాల్సి ఉంది.

➡️