అల్లుడుకి 150 రుచుల పిండివంటలు

food items to son in law

ప్రజాశక్తి-రాజానగరం :  గోదావరోళ్ళుకు ఎటకారం, మమకారంతోపాటు అతిధులకు రుచికరమైన పదార్థాలు వండి వడ్డించడం ప్రత్యేకత. అదే సంక్రాంతి పండుగ రోజు కొత్త అల్లుడు ఇంటికి వస్తే వడ్డించే రుచులు ఎలా ఉంటుందో ఊహించుకోండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చెందిన చవ్వా నాగ వెంకట శివాజీ, సునీత దంపతులు కొత్త అల్లుడు రీషింద్ర, కుమార్తె హర్షితలు 150 పిండివంటల వండి వడ్డించిన రుచులు చూశాడు. దీనిలో చక్రపొంగలి, పులిహోర, చిక్కిరాలు, కోవా తదితరులతో పాటు పాలు పెరుగు కలిపి వివిధ రుచుల పిండివంటలు ఉన్నాయి. దీంతో ఆ కొత్త అల్లుడు ఉబ్బితబ్బిబ్బైయైనాడు. గోదావరోళ్ళు మర్యాదలు మామోలుగా ఉంటుందా… మర్యాదలకు పుట్టిల్లు కదా..

➡️