మూడోసారి గ్రూప్‌ 2 పరీక్ష మరోసారి వాయిదా..

Dec 28,2023 11:20 #canceled, #Group Exams, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యార్థులకు మరోసారి నిరాశ ఎదురైయ్యింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6,7వ తేదీల్లో పరీక్ష నిర్వహించాలి. అయితే.. ఇటీవల టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో ఈ పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గ్రూప్‌-2 పరీక్షను మరోసారి వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన చేసింది. కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➡️