మాజీ మంత్రి బండారుకు అస్వస్థత

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి :మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బిపి, సుగర్‌ పెరగడంతో ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని మహరాణిపేటలో ఉన్న ఓ ప్రయివేటు ఆస్పపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. పెందుర్తి టికెట్‌ ఇవ్వకపోవడంతో బండారు కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. బిపి, సుగర్‌ నియంత్రణలో లేకపోవడంతో ఆస్పపత్రికి తీసుకొచ్చినట్లు ఆయన కుమారుడు అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణమూర్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

➡️