వైసిపి మాజీ ఎంపి నందిగం సురేశ్‌ సోదరుడు అరెస్ట్‌

బాపట్ల : బాపట్ల వైసిపి నేత, మాజీ ఎంపి నందిగం సురేశ్‌ సోదరుడు ప్రభుదాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయనను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో ఇసుకను తరలిస్తున్న లారీలను తుళ్లూరు పోలీసులు పట్టుకొని ప్రభుదాస్‌ను అరెస్ట్‌ చేశారు. రెండు లారీలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️