‘ఉచిత బస్సు ప్రయాణం’ జీవో విడుదల

Dec 9,2023 10:02 #Telangana, #Women
free bus service for women

హైదరాబాద్ : తెలంగాణలో మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథకం విధివిధానాలను ప్రభుత్వం వెల్లడించింది. అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి అమలు కానుంది. రాష్ట్రంలో టిఎస్.ఆర్.టి.సి యొక్క పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని తెలిపింది. 9వ తేదీ(శనివారం) మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీల కోసం తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి ఖర్చును రీయింబర్స్ చేస్తుంది.

➡️