తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

gadam prasad kumar as speaker

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ క్రమంలో డిప్యూటి సిఎంలతో సహా 12మంది మంత్రుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. 2008లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన ప్రసాద్ కుమార్ 2009లో రెండోసారి వికారాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2012లో నల్లారి క్యాబినెట్లో టెక్స్టైల్ మంత్రిగా పనిచేశారు. ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కు పేరును ప్రకటించారు. తెలంగాణకు ఒకే ఒక డిప్యూటీ సీఎంని ప్రకటించారు. మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సీతక్క, సుదర్శన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ తదితరులున్నారు. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు దక్కలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సభకు ఆహ్వానించారు. 300 సీట్లతో అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ మేధావులు ఉద్యమకారుల కోసం మరో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకరానికి ఎల్బి స్టేడియం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు సిద్ధమయ్యింది.

➡️