బోటులో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ : కోస్ట్‌గార్డు రెస్క్యూ ఆపరేషన్‌

కాకినాడ : కాకినాడ తీరంలో మత్స్యకారులు వేటకు వెళుతున్న బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. బోటులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు వ్యాపించడంతో 11 మంది మత్స్యకారులు అందులో చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బోటులోని మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

➡️