పవన్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ..

Feb 5,2024 16:12 #JanaSena, #pavan kalyan

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.. వైసిపిని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్‌ కల్యాణ్‌ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తే రెండున్నర ఏళ్లు.. పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించాలని లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు.

➡️