వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..

Jun 20,2024 11:01 #heavy rains, #next week.., #Telangana

తెలంగాణ: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలు ఉంటాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రాష్ట్రంలో తీవ్రమైన ఉక్కపోత.. వేడిమి వాతావరణం ఉంటుందని తెలిపింది. వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినా ఒక్క చోటే కురవడం మరో చోట వర్షం కురవకపోవడం ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బుదులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురుస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఇండో-జర్మన్‌ నిపుణులు కూడా తెలంగాణ వాతావరణాన్ని పరిశోధించారు. వారి అంచనా ప్రకారం తెలంగాణలో జూన్‌ 21, 22 తేదీల్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించగా.. జూన్‌ 21న తూర్పు తెలంగాణ, 22న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు ప్రకటించారు.

➡️