ఆగి ఉన్న లారీని ఢీకొని భార్యాభర్తలు మృతి

Apr 4,2024 07:29 #Krishna district, #road accident

ప్రజాశక్తి-ఘంటసాల : కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చల్లపల్లి మండలం పచ్చర్లంక గ్రామానికి చెందిన దాసరి నాగేశ్వరరావు – బేబమ్మ దంపతులు వివాహ వేడుక నిమిత్తం ఉదయం ఐదు గంటల సమయంలో చల్లపల్లి గ్రామానికి వెళ్తూ ఉండగా లంకపల్లి సమీపానికి వచ్చే సమయంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరువురి మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

➡️