భార్యాభర్తల ఆత్మహత్య

Apr 8,2024 21:20 #2 death, #family died, #suside
  • ఆర్థిక ఇబ్బందులే కారణం?

ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్లకు చెందిన కోయ విష్ణుప్రసాద్‌ (45) కొంతకాలంగా అప్పికట్ల గ్రామంలో ఎరువులు, పురుగు మందుల షాపు నిర్వహిస్తున్నారు. రైతులకు పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చారు. అవి తిరిగి వసూలు కాకపోవడం, తాను తెచ్చిన అప్పులు తీర్చలేక కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవ్వడంతో తన భార్య లక్ష్మీప్రసన్న (40)తో కలిసి ఇంట్లోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. అప్పులు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలియకపోయినా రూ.కోట్లల్లోనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దంపతులు ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులేనా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

➡️