కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం : సిఎం రేవంత్‌

Mar 4,2024 12:16 #adilabad, #CM Revanth Reddy, #speech

ఆదిలాబాద్‌ : కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివఅద్ధికి ఆటంకం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి నేతలు, సిఎం రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌లు ఆదిలాబాద్‌కు చేరుకున్నారు.

ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ … ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోడి అనేక అభివఅద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

అనంతరం…సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ … తెలంగాణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని మోడికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్ట్‌లో మిగిలినవాటికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి సాదర స్వాగతం పలికారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్‌ ఉత్పత్తిలో వెనుకబడ్డామన్నారు. తెలంగాణ అభివఅద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివఅద్ధి వెనుకబడుతుందని… రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందుకెళతామని స్పష్టం చేశారు. తమ వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు ప్రధాని సహకారం కావాలన్నారు. ప్రధానమంత్రి అంటే తమకు పెద్దన్నలాంటివారు అని, విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే సాధించామని చెప్పారు. దేశంలో ఐదు ట్రిలియన్‌ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుందన్నారు. కంటోన్మెంట్‌ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారని రేవంత్‌ తెలిపారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివఅద్ధికి ఆటంకం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తాం. ఎన్టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకరిస్తుంది. కంటోన్మెంట్‌ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు’ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

➡️