కూతురును నరికి చంపిన కన్న తండ్రి

May 12,2024 20:45 #crime

ప్రజాశక్తి-ఐ.పోలవరం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) :అనుమానంతో కూతురును కన్న తండ్రే నరికి చంపిన ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మండలంలోని పాతఇంజరంలో కౌలు రైతు మాదాసు శివ సుబ్రహ్మణ్యం కుటుంబం ఉంటోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన భార్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఆదివారం చిన్న కుమార్తె, కుమారుడు బయటకు వెళ్లారు. అదే సమయంలో పెద్ద కుమార్తె మాదాసు రాణి (27)పై తండ్రి సుబ్రహ్మణ్యం కత్తితో దాడి చేశాడు. మెడ పైన, భుజంపైన నరికాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించారు. సుబ్రహ్మణ్యం పోలీసులకు లంగిపోయాడు. కుమార్తెపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్‌ఐ జె భాను ప్రసాద్‌ తెలిపారు.

➡️