బీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష నేతగా కేసీఆర్‌

Dec 9,2023 10:40 #Assembly, #Former CM KCR, #Telangana

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్‌ జరిగింది. సీనియర్‌ లీడర్‌ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 38 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ గైర్హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్‌ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడానికి శనివారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌ లో తమ లీడర్‌గా కేసీఆర్‌ను ఎన్నుకుంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఒకే బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

➡️