ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను నియమిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం మరోసారి క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు పంపించాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలని సూచించింది.

➡️