కొత్తగూడెంలో కూనంనేని జయభేరి

  • 26,214 ఓట్ల మెజార్టీతో జలగంపై గెలుపు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏకైక జనరల్‌ నియోజకవర్గమైన కొత్తగూడెంలో కాంగ్రెస్‌ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఘన విజయం సాధించారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి జలగం వెంకటరావుపై 26,214 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధికార పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు మూడో స్థానానికి పరిమితమయ్యారు. కూనంనేని సాంబశివరావుకు 79,155 ఓట్లు రాగా జలగం వెంకట్రావుకు 52,971, వెంకటేశ్వరరావుకు 37,226 ఓట్లు పోలయ్యాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 2,43,846 ఓట్లు ఉండగా 1,86,347 ఓట్లు పోలయ్యాయి. 76.56 శాతం పోలింగ్‌ జరిగింది.

➡️